Wednesday, January 22, 2025

దక్షిణాఫ్రికా లెజండరీ క్రికెటర్ క‌న్నుమూత‌..

- Advertisement -
- Advertisement -

ద‌క్షిణాఫ్రికా లెజెండ‌రీ క్రికెటర్ మైక్ ప్రొక్టెర్(77) క‌న్నుమూశారు. దీంతో ద‌క్షిణాఫ్రికా క్రికెట్‌లో విషాదం నెల‌కొంది. గుండె స‌ర్జ‌రీ సంబంధిత స‌మ‌స్య‌తో మైక్ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. మైక్ తన కెరీర్ లో దక్షిణాఫ్రికా తరఫున కేవలం 7 టెస్టులు మాత్ర‌మే ఆడాడు. ఆ ఏడు టెస్టు మ్యాచ్ లు కూడా ఆస్ట్రేలియా జట్టు మీద‌నే ఆడడం విశేషం. ఈ మ్యాచుల్లో మైక్ 41 వికెట్లు తీశాడు.

కెరీర్ తొలినాళ్లలో గొప్ప ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న మైక్.. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఎక్కువగా టెస్టు మ్యాచ్ లు ఆడలేకపోయాడు. తన మొత్తం కెరీర్ లో మైక్.. 48 సెంచరీలు సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో వరుసగా ఆరు సెంచరీల రికార్డు మైక్ పేరిట ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News