టి20, వన్డేలకు మార్‌క్రమ్, టెస్టులకు బావుమా సారథ్యం
జోహెన్నస్‌బర్గ్: భారత్‌తో సొంత గడ్డపై జరిగే సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టును ప్రకటించారు. టి20, వన్డే జట్లకు ఐడెన్ మార్‌క్రమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. టెస్టు టీమ్ కెప్టెన్సీ బాధతలను తెంబా బావుమాకు అప్పగించారు. భారత్‌తో సౌతాఫ్రికా మూడు టి20లు, రెండు టెస్టులు, మరో 3 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. డిసెంబర్ 10 నుంచి సిరీస్ జరుగనుంది. తొలుత టి20లు, ఆ తర్వాత వన్డే సిరీస్‌లు జరుగుతాయి.
టెస్టు సిరీస్ జనవరిలో జరుగుతుంది. కాగా, ఇటీవల భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన తెంబా బావుమాను పరిమిత ఓవర్ల టీమ్ నుంచి తప్పించారు. అయితే అతను టెస్టుల్లో మాత్రం ఆడుతాడు. టి20, వన్డేల్లో మార్‌క్రమ్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. టెస్టులు, వన్డేలు, టి20లకు వేర్వేరు జట్లను సౌతాఫ్రికా బోర్డు ఎంపిక చేసింది.
జట్ల వివరాలు:
టి20 టీమ్: మార్‌క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీడ్జ్‌కే, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, డొనొవాస్ పెరీరా, రీజా హెండ్రిక్స్, మర్కో జాన్సన్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహారాజ్, ఎంగిడి, పెహ్లుక్‌వాయో, విలియమ్స్, ట్రిస్టన్ స్టబ్స్.
వన్డే టీమ్: మార్‌క్రమ్ (కెప్టెన్), బార్ట్‌మన్, బర్గర్, టోనీ డి జోర్జి, హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, మహారాజ్, మిహాల్లీ మ్పోంగ్వానా, డేవిడ్ మిల్లర్, పెహ్లుక్‌వాయో, షంసి, విలియమ్స్, డుస్సెన్, వెరిన్నే.
టెస్టు టీమ్: బావుమా (కెప్టెన్), బెడింగ్‌హామ్, నాండ్రే బర్గర్, కోయెట్జి, డి జోర్జి, ఎల్గర్, జాన్సన్, కేశవ్ మహారాజ్, మార్‌క్రమ్, వియాన్ ముల్లర్, పీటర్సన్, కైల్ వెరిన్నే, స్టబ్స్, రబాడ.