Thursday, January 23, 2025

విండీస్‌తో టెస్టు సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ఎంపిక

- Advertisement -
- Advertisement -

కెప్టెన్‌గా బవుమా.. మాథ్యూ బ్రీట్‌జ్కెకు చోటు

జోహర్నెస్ట్ బర్గ్ : వెస్టిండీస్‌తో జరగబోయే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. టెంబా బావుమా నాయకత్వంలో 16 మందితో కూడిన బలమైన జట్టు వివరాలను సోమవారం విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌తో జరిగిన రెండో టెస్టులో ఆడలేకపోయిన బవుమా తిరిగి సఫారీ జట్టు సారథ్య బాధ్యలు చేపట్టనున్నాడు. అయితే ఈ టెస్ట్‌ల్లో మాథ్యూ బ్రీట్జ్కే దక్షిణాఫ్రికా తరుపున అరంగ్రేటం చేయనున్నాడు. ఇక, టీ20 ప్రపంచకప్ ఆడి అలసిపోయిన పేసర్ మార్కో జాన్సెన్‌కు విశ్రాంతినిచ్చాడు. ఆగస్టు 7 నుంచి 19 వరకు టెస్ట్ సిరీస్ జరగనుండగా.. అనంతరం ఆగస్టు 23 నుంచి టి20 సిరీస్ షురూ కానుంది.
దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా(కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హామ్, మాథ్యూ బ్రీట్‌జ్కె, నండ్రే బర్గర్, గెరాల్ కోయెట్జీ, టోనీ డి జోర్జీ, కేశవ్ మహరాజ్ , ఐడెన్ మార్‌క్రామ్, వియాన్ ముల్డర్, లుంగీ ఎన్‌గిడి, డేన్ ప్యాటర్సన్, కైల్ వెర్రెయిన్ డేన్ ప్యాటర్సన్, కగిసొ రబాడా, ర్యాన్ రికెల్టన్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News