Friday, December 20, 2024

నేడు సౌతాఫ్రికాతో అఫ్గాన్‌ పోరు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం అహ్మదాబాద్‌లోజరిగే కీలక మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ టీమ్ బలమైన సౌతాఫ్రికాతో తలపడనుంది. సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే అఫ్గాన్ ఈ మ్యాచ్‌లో భారీ విజయాన్ని సాధించాల్సి ఉంది. సౌతాఫ్రికా ఇప్పటికే వరల్డ్‌కప్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్థాన్ అంచనాలకు మించి రాణించింది. ఆస్ట్రేలియాతో జరిగిన కిందటి మ్యాచ్‌లో విజయం కోసం చివరి వరకు పోరాడి ఓడింది. ఒక వేళ ఆ మ్యాచ్‌లో గెలిచి ఉంటే అఫ్గాన్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగ్గా ఉండేవి. అయితే ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మ్యాక్‌వెల్ కళ్లు చెదిరే అజేయ డబుల్ సెంచరీతో అఫ్గాన్ గెలుపు ఆశలపై నీళ్లు చెల్లాడు.

ఇలాంటి స్థితిలో పటిష్టమైన సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్ అఫ్గాన్ టీమ్‌కు సవాల్ వంటిదేనని చెప్పాలి. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధించడంతో పాటు పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఫలితంపైనే అఫ్గాన్ ఆశలు ఆధారపడి ఉంటాయి. అయితే ప్రస్తుతం ఆయా జట్లు ఉన్న స్థితిని పరిగణలోకి తీసుకుంటే అఫ్గాన్‌కు సెమీస్ ఆశలు చాలా తక్కువేనని చెప్పాలి. మరోవైపు దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో గెలిచి లీగ్ దశను ముగించాలని భావిస్తోంది. కిందటి మ్యాచ్‌లో భారత్ చేతిలో సఫారీ 243 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News