Thursday, January 23, 2025

సౌతాఫ్రికాకు వరుణుడి షాక్

- Advertisement -
- Advertisement -

వర్షం వల్ల జింబాబ్వే మ్యాచ్ రద్దు

south africa vs zimbabwe

హోబర్ట్ : ప్రపంచకప్ సూపర్12లో భాగంగా సౌతాఫ్రికాజింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్ వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దయ్యింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 9 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. వెస్లీ మధెవర్(35) విధ్వంసక ఇన్నింగ్స్‌తో జింబాబ్వేను ఆదుకున్నాడు. మిల్టన్ షుంబా 18 (నాటౌట్) అతనికి అండగా ఉన్నాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. విధ్వంసక ఇన్నిం గ్స్ ఆడి ఓపెనర్ క్వింటాన్ డికాక్ 18 బంతుల్లోనే 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 47 పరుగులు చేశాడు. ఈ దశలో వర్షం రావడంతో ఆట అక్కడే నిలిచిపోయిం ది. మైదానం పూర్తిగా చిత్తడిగా మారడంతో మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు. దీంతో ఇరు జట్లకు చెరో పాయిం ట్ లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News