Friday, December 20, 2024

మూడో వన్డేలో పోరాడి ఓడిన భారత్..

- Advertisement -
- Advertisement -

మూడో వన్డేలోనూ భారత్ ఓటమి
4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం
3-0తో సిరీస్ కైవసం
కేప్‌టౌన్: మూడో వన్డేలోనూ భారత్ ఓటమి పాలైంది. చివరి వన్డేలోనైనా గెలుపొంది పరువు నిలుకుంటుందనే అందరి ఆశలను అడియాశలు చేసింది. దీంతో సౌతాఫ్రికా మూడు వన్డేల సిరీస్‌ను 30తో క్లీన్‌స్వీప్ చేశారు. సఫారీల గడ్డపై భారత బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు సమష్టిగా వైఫల్యం చెందారు. సౌతాఫ్రికా నిర్దేశించిన 288 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 49.2 ఓవర్లలో 283 పరుగులకు చాప చుట్టేసింది. దీంతో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. భారత బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ 65, ధావన్ 61, దీపక్ చాహర్ 54, సూర్యకుమార్ 39, శ్రేయస్ అయ్యర్ 26 తప్ప మరెవరూ రాణించలేక పోయారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, ఆండిల్ మూడేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 49.5 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. సఫారీ జట్టులో డికాక్ 124 పరుగులు చేసి భారత బౌలర్ల నడ్డి విడిచాడు. భారత బౌలర్లలో ప్రసిధ్ 3, చాహర్, బుమ్రా రెండేసి వికెట్లు తీశారు.

South Africa win by 4 runs Against India in 3rd ODI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News