Thursday, January 23, 2025

కివీస్‌పై సౌతాఫ్రికా భారీ విజయం

- Advertisement -
- Advertisement -

పుణె: ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా ఆరో విజయాన్ని అందుకుంది. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 190 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు న్యూజిలాండ్ వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసింది. ఇంతకుముందు భారత్, ఆస్ట్రేలియా చేతుల్లోనూ కివీస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ మరోసారి శతకంతో చెలరేగాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన డికాక్ 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 114 పరుగులు చేశాడు. మరోవైపు ధాటిగా ఆడిన వండర్ డుసెన్ 118 బంతుల్లోనే ఐదు సిక్సర్లు, 9 బౌండరీలతో 1333 పరుగులు సాధించాడు.

మిల్లర్ 30 బంతుల్లోనే 4 సిక్స్‌లు, రెండు ఫోర్లతో 53 పరుగులు చేశాడు. దీంతో సఫారీ స్కోరు 357 పరుగులకు చేరింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 35.3 ఓవర్లలో కేవలం 167 పరుగులకే కుప్పకూలింది. గ్లెన్ ఫిలిప్స్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఫిలిప్స్ 4 సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 60 పరుగులు సాధించాడు. మిగతా వారిలో విల్ యంగ్ (33), మిఛెల్ (24) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. సఫారీ బౌలర్లలో కేశవ్ మహారాజ్ నాలుగు, జాన్సెన్ మూడు, కొయెట్జి రెండు వికెట్లు తీశారు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News