Sunday, January 19, 2025

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో వన్డే వరల్డ్ కప్ చేజేతులా చేజార్చుకున్న రోహిత్ సేన ఇప్పడు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ టైటిల్‌పై కన్నెశాడు. అందులో భాగంగా సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు సిరీస్‌లో అడుగు పెట్టారు. అయితే తొలి టెస్టులోనే భారత్ షాక్ తగిలింది. సఫారీల చేతిలో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలై చెత్త రికార్డును మూటగట్టుకుంది. రెండు టెస్టుల సిరీస్ 0-1తో వెనుబడిన టిమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. మరి కాసేపట్లో రెండో మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదట టాస్ గెలిచి దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ డీన్ ఎల్గర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెరీర్ చివరి టెస్టు మ్యాచ్ ఆడుతోన్న ఎల్గర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News