- Advertisement -
ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. శుక్రవారం గ్రూప్‌బిలో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుతబ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఓపెనర్ రికెల్టన్ (103) సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ బవుమా (58), మార్‌క్రమ్ 52 (నాటౌట్), వండర్ డుసెన్ (52) అర్ధ సెంచరీలతో రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ టీమ్ 43.3 ఓవర్లలో 208 పరుగులకే కుప్పకూలింది. రహమత్ షా (90) అద్భుత పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది.
- Advertisement -