Sunday, June 30, 2024

ఫైనల్‌కు చేరుకున్న సౌతాఫ్రికా

- Advertisement -
- Advertisement -

ట్రినిడాడ్: టి20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఆఫ్ఘానిస్థాన్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి సౌతాఫ్రికా ఫైనల్‌కు చేరుకుంది. ఆఫ్ఘాన్ నిర్దేశించిన 57 పరుగుల లక్ష్యాన్ని 8.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 60 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ ఐదు పరుగులు చేసి ఫరూకీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. రీజా హెండ్రిక్స్(29), ఎయిడెన్ మాక్రమ్(23) పరుగులు చేశారు. ప్రధానమైన మూడు వికెట్లు తీసి మార్కో జాన్సన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన అప్ఘాన్ 11.5 ఓవర్లలో 56 పరుగులు చేసి ఆలౌటైంది. సౌతాప్రికా ముందు 57 పరుగుల లక్ష్యాన్ని అఫ్ఘాన్ ఉంచింది. మార్కోజాన్సన్, రబడా బౌలింగ్ దాటికి అఫ్ఘాన్  బ్యాట్స్ మెన్లు కుప్పకూలిపోయారు. అఫ్ఘాన్ బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అఫ్ఘాన్ బ్యాట్స్‌మెన్లు అజ్మతుల్లా(10), గుల్బాదిన్(09), కరీమ్ జనత్(08), రషీద్ ఖాన్(08), ఇబ్రహీం జడ్రాన్(02), నంగేయాలియా ఖరోటీ(2), నవీన్ హుల్ హక్(02), ఫజల్‌హక్ ఫారూకీ(02), గుర్బాజ్(0), నబీ(0), నూర్ అహ్మద్(0) పరుగులు చేసి ఔటయ్యారు దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్, షమ్సీ చెరో మూడు వికెట్లు తీయగా రబడా, నోర్ట్జ్ చెరో రెండు వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News