Wednesday, January 22, 2025

సౌతాఫ్రికాకు ఓదార్పు

- Advertisement -
- Advertisement -

కదంతొక్కిన రోసోవ్
డికాక్, మిల్లర్ మెరుపులు
చివరి టి20లో భారత్ ఓటమి
ఇండోర్: భారత్‌తో మంగళవారం జరిగిన చివరి టి20లో సౌతాఫ్రికా 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా భారత్ 21 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలి రెండు టి20లలో టీమిండియా జయకేతనం ఎగుర వేసిన విషయం తెలిసిందే. ఇక మూడో టి20లో దక్షిణాఫ్రికాకు ఓదార్పు విజయం లభించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్, వన్‌డౌన్‌లో వచ్చిన రిలి రోసోవ్ అసాధారణ బ్యాటింగ్‌తో భారత బౌలర్లను హడలెత్తించారు. ధాటిగా ఆడిన డికాక్ 43 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, మరో 6 ఫోర్లతో 68 పరుగులు చేశాడు. ఇక రోసోవ్ అజేయ శతకంతో అలరించాడు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రోసోవ్ 48 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లు, మరో 7 బౌండరీలతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక మిల్లర్ 3 సిక్సర్లతో అజేయంగా 19 పరుగులు చేశాడు. దీంతో సౌతాఫ్రికా రికార్డు స్థాయిలో 227 పరుగులు చేసింది. తర్వాత భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 18.3 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. దినేశ్ కార్తీక్ (46), రిషబ్ పంత్ (27), దీపక్ (31), ఉమేశ్ 20 (నాటౌట్) రాణించినా ఫలితం లేకుండా పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News