Thursday, January 16, 2025

సౌతాఫ్రికా ఘన విజయం

- Advertisement -
- Advertisement -

కివీస్‌తో టెస్టు సిరీస్ సమం

క్రెస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో, చివరి టెస్టులో సౌతాఫ్రికా 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా సిరీస్‌ను 11తో సమంగా ముగించింది. విజయం కోసం 426 పరుగులు చేయాల్సిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 227 పరుగులకే ఆలౌటైంది.

మంగళవారం చివరి రోజు 94/4 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ చేపట్టిన కివీస్ ఆరంభంలో బాగానే ఆడింది. డెవోన్ కాన్వే, వికెట్ కీపర్ టామ్ బ్లుండెల్ సౌతాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఈ జోడీని విడగొట్టేందుకు సఫారీ బౌలర్లు చాలా సేపటి వరకు నిరీక్షించాల్సి వచ్చింది. అయితే 188 బంతుల్లో 13 ఫోర్లతో 92 పరుగులు చేసిన కాన్వేను సిపామ్లా ఔట్ చేశాడు.

ఆ వెంటనే బ్లుండెల్ (44) కూడా ఔటయ్యాడు. తర్వాత కివీస్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ, జాన్‌సెన్, మహారాజ్ మూడేసి వికెట్లు పడగొట్టారు. దీంతో కివీస్ ఇన్నింగ్స్ 227 పరుగులకే ఆలౌటైంది. ఇక తొలి టెస్టులో కివీస్ విజయం సాధించింది. మరోవైపు రెండు టెస్టులో గెలిచి సౌతాఫ్రికా సిరీస్‌ను సమం చేసింది. రబాడకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కగా, మ్యాట్ హెన్రీ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News