Friday, June 28, 2024

లంకపై గెలిచిన సౌతాఫ్రికా

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా శ్రీలంకపై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి లంక 19.1 ఓవర్లలో 77 పరుగులు చేసి ఆలౌటైంది. నోర్ట్జ్ నిప్పులు చెరిగే బంతులతో లంకను భయపెట్టాడు. నోర్ట్జ్ నాలుగు వికెట్లు తీసి లంక నడ్డి విరిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో నోర్ట్ నాలుగు వికెట్లు, మహారాజా, రబడా చెరో రెండు వికెట్లు, బార్టమ్ ఒక వికెట్ తీసి లంకను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టారు. దీంతో 77 పరుగులకే సింహాలీలు తొక ముడిచారు. 78 పరుగుల లక్షంతో బరిలో దిగిన సౌతాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. సౌత్రాఫికా బ్యాట్స్‌మెన్లలో క్వింటన్ డికాక్(20), హెన్రీచ్ క్లాసెన్(19), స్టబ్స్(13), మక్రమ్(12), రీజా హెండ్రిక్స్(04) పరుగులు చేశారు. నాలుగు వికెట్లు తీసిన నోర్ట్జ్  కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News