Sunday, December 22, 2024

టాస్ గెలిచిన సౌతాఫ్రికా

- Advertisement -
- Advertisement -

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కాసేపట్లో మొదలు కానున్న ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది. సమవుజ్జీల సమరంగా క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్న ఈ పోటీలో గెలిచే జట్టును ఈ నెల 19న జరిగే ఫైనల్ లో టీమిండియా ఢీకొట్టనుంది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చెరో రెండు పోటీల్లోనూ ఓడిపోయి, పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఛేజింగ్ లోకి దిగితే సత్తా చూపించే ఆస్ట్రేలియాపై గెలవాలంటే సౌతాఫ్రికా భారీ స్కోరు చేయాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News