Sunday, December 22, 2024

కునో పార్కులో 5 చీటా పిల్లల జననం

- Advertisement -
- Advertisement -

ఒక ఆశావహ ప్రాజెక్టులో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి మధ్య ప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు తీసుకువచ్చిన ఐదు సంవత్సరాల చీటా గామినిఐదు పిల్లలకు జన్మ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఆదివారం వెల్లడించారు. వాటితో భారత్‌లో జన్మించిన చీటా పిల్లల సంఖ్య13కు పెరిగింది. కునో పార్కులో పిల్లలతో సహా చీటాల సంఖ్య 26కు చేరుకున్నది. ‘హై ఫైవ్ కునో ! దక్షిణాఫ్రికాలోని స్వాలు కలహరి రిజర్వ్ నుంచి తీసుకువచ్చిన దాదాపు 5 ఏళ్ల ఆడ చీటా గామిని ఆదివారం ఐదు పిల్లలకు జన్మ ఇచ్చింది. వాటితో దేశంలో పుట్టిన పిల్లల సంఖ్య 13కు చేరుకుంది. భారత భూభాగంపై ఇది నాలుగవ చీటా సంతానం. దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీటాల్లో ఇది తొలి సంతానం’ అని మంత్రి యాదవ్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News