హైదరాబాద్: అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్, నర్సాపురం నుంచి ఈ రైళ్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. రైలు నెంబర్ 07121 సికింద్రాబాద్ నుంచి కొల్లాం వరకు 2023 నవంబర్ 19వ తేదీన అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ రైలు ఆదివారం మధ్యాహ్నం 2.20 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి సోమవారం రాత్రి 11.55 గంటలకు కొల్లాం చేరుకుంటుందని అధికారులు తెలిపారు. రైలు నెంబర్ 07122 కొల్లాం నుంచి సికింద్రాబాద్ వరకు 2023 నవంబర్ 21వ తేదీన అందుబాటులో ఉంటుందని, ఈ రైలు మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లాంలో బయల్దేరుతుందని అధికారులు తెలిపారు. ఈ రైలు బుధవారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని, సికింద్రాబాద్ , కొల్లాం రూట్‌లో నడిచే రైలు చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట్, వరంగల్ మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోల్, కావలి, నెల్లూర్, గూడూర్, రేణిగుంట, కాట్‌పాడి,
జోలాప్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, చెంగన్నూర్, మవెలికెర రైల్వే స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. రైలు నెంబర్ 07119 నర్సాపూర్ నుంచి కొట్టాయం వరకు 2023 నవంబర్ 19వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ రైలు ఆదివారం మధ్యాహ్నం 3.50 గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరి సోమవారం మధ్యాహ్నం 4.50 గంటలకు కొట్టాయం చేరుకుంటుందని అధికారులు తెలిపారు. రైలు నెంబర్ 07120 కొట్టాయం నుంచి నర్సాపూర్ వరకు 2023 నవంబర్ 20న అందుబాటులో ఉంటుందని, ఈ రైలు సోమవారం రాత్రి 7 గంటలకు కొట్టాయంలో బయల్దేరి మంగళవారం రాత్రి 9 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. నర్సాపూర్, కొట్టాయం రూట్‌లో నడిచే రైలు పాలకొల్లు, భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోల్, నెల్లూర్, గూడూర్, రేణిగుంట, కాట్‌పాడి, జోలాప్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్ రైల్వే స్టేషన్లలో ఆగుతుందని అధికారులు పేర్కొన్నారు.