Sunday, January 19, 2025

వేసవికి ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ తెలిపింది. వేసవి సెలవుల్లో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు, వేసవి విడిదిలకు వెళ్లాలనుకునే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ఈసారి కూడా ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికుల కోసం మరికొన్ని సమ్మర్ స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. శుక్రవారం నుంచి జూన్ వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు రైళ్ల వివరాలను శుక్రవారం రైల్వే శాఖ వెల్లడించింది.

ఈ రైళ్లకు సంబంధించిన వివరాలు ఇలా…

ఈ రైళ్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి- టు అకోలా (07605), అకోలా- టు తిరుపతి (07606), పూర్ణ- టు తిరుపతి (07607), తిరుపతి టు -పూర్ణ (07608), హైద్రాబాద్- టు నర్సాపూర్(07631), నర్సాపూర్- టు హైద్రాబాద్(07632), హైదరాబాద్- టు తిరుపతి (07643), తిరుపతి- టు హైదరాబాద్- (07644), విజయవాడ- టు నాగర్ సోయిల్ (07698), నాగర్ సోయిల్- టు విజయవాడ (07699) ఈ ట్రైన్లను మరికొన్ని రోజుల పాటు పొడిగించారు. దీంతోపాటు కాకినాడ- టు లింగంపల్లి (07445), లింగంపల్లి- టు కాకినాడ (07446), మచిలీపట్నం- టు సికింద్రాబాద్ (07185), సికింద్రాబాద్- టు మచిలీపట్నం (07186), తిరుపతి- టు సికింద్రాబాద్ (07481), సికింద్రాబాద్- టు తిరుపతి (07482), మచిలీపట్నం- టు తిరుపతి (07095), తిరుపతి- టు మచిలీపట్నం (07096) రైళ్లను జూన్ వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News