Wednesday, January 22, 2025

మరిన్ని రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మరిన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సాంకేతిక కారణాలతో నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు 4 రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. కాచిగూడ-టు నిజామాబాద్ (07596), నిజామాబాద్- టు కాచిగూడ (07593), నాందేడ్- టు నిజామాబాద్ (07854), నిజామాబాద్ టు -నాందేడ్ (07853) రైళ్లు రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

అదేవిధంగా డౌండ్- టు నిజామాబాద్, మున్టేడ్- టు నిజామాబాద్ (11409) రైలును నేటి నుంచి 13వ తేదీ వరకు రద్దు చేస్తుండగా నిజామాబాద్- టు పంధర్పూర్, నిజామాబాద్ టు -ముఖేడ్ (01413) రైలును గురువారం (ఈనెల 8 వ తేదీ) నుంచి 14 వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ మేరకు ప్రయాణికులు రద్దైన రైళ్ల వివరాలను గమనించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News