Wednesday, January 22, 2025

జన్మభూమి , గరీబ్థ్ సహా 52 రైళ్ల రద్దు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అనేక రైళ్లు రద్దయ్యాయి. తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే మొత్తం 52 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. మరికొన్నిరైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. గుండాలా విజయవాడ సెక్షన్ పరిధిలో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.

దీంతో ఈ నెల 22 నుంచి ఈ నెలాఖరువరకు వివిధ తేదీల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. రద్దయిన రైళ్ల జాబితాలో హైదరాబాద్ విఖాఖపట్టణం మార్గంలో ఉన్న జన్మభూమి ( 1280512806), గరీబ్థ్ (1273912740) సహా విశాఖ చెన్నై, తిరుపతిభువనేశ్వర్, హైదరాబాద్ కటక్ వంటి రైళ్లు సైతం రద్దయ్యాయి. విజయవాడ మచిలీపట్నం, విజయవాడనర్సాపురం మధ్య నడిచే కొన్ని రైళ్ల స్టాఫ్‌లను మార్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News