Friday, November 15, 2024

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త

- Advertisement -
- Advertisement -

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు పలు ప్రత్యేక రైళ్లను పొడిగింపు

మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వరుస పండగలను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరింది. వరుస పండుగల నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పెంచిన ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్- టు రక్సౌల్ మధ్య ప్రతి శనివారం (రైలు నంబర్ 07051) ఈ రైలు నడుస్తుంది. అక్టోబర్ 7వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకు కొనసాగనుంది. రక్సౌల్- టు సికింద్రాబాద్ మధ్య ప్రతి శుక్రవారం (ట్రైన్ నంబర్ 07052) ఈ రైలు నడుస్తుంది. ఈ రైలు అక్టోబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.

సికింద్రాబాద్ -టు- దానాపూర్ (రైలు నంబర్ 07419) అక్టోబర్ 7వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకు, దానాపూర్ -టు సికింద్రాబాద్ (ట్రైన్ నంబర్ 07419) అక్టోబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 27వ తేదీ వరకు, సికింద్రాబాద్ -టు రక్సౌల్ (రైలు నంబర్ 07007) రైలు అక్టోబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 29వ తేదీ వరకు నడపాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది.

డిసెంబర్ 01వ తేదీ వరకు రైళ్లు అందుబాటులోకి…
వీటితో పాటు రక్సౌల్ -టు- సికింద్రాబాద్
(ట్రైన్ నంబర్ 07008) అక్టోబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 01వ తేదీ మధ్య పరుగులు తీయనుండగా, కాచిగూడ- టు మధురై (రైలు నంబర్ 07191) సర్వీసు అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ, మధురై -టు కాచిగూడ (ట్రైన్ నంబర్ 07192) అక్టోబర్ 18వ తేదీ నుంచి నవంబర్ 29వ తేదీ వరకు, కాచిగూడ -టు నాగర్‌కోయిల్ మధ్య నడిచే రైలు(07435) అక్టోబర్ 13వ తేదీ నుంచి నవంబర్ 24వ తేదీ వరకు, నాగర్‌కోయిల్ టు- కాచిగూడ ( 07436) ట్రైన్ అక్టోబర్ 15వ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ మధ్య, సికింద్రాబాద్ -టు రామనాథపురం (07695) మధ్య నడిచే ఈ సర్వీస్ అక్టోబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 29వ తేదీ వరకు, రామనాథపురం -టు సికింద్రాబాద్ (07696) అక్టోబర్ 13వ తేదీ నుంచి నవంబర్ 24వ తేదీ వరకు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News