మనతెలంగాణ/హైదరాబాద్: దసరా, దీపావళి, ఛాత్ పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను పొడిగిస్తోంది. విశాఖపట్నం, సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు, విశాఖపట్నం టు సికింద్రాబాద్ ప్రత్యేక రైలు, విజయవాడ టు సికింద్రాబాద్ ప్రత్యేక రైలు, దసరా స్పెషల్ ట్రైన్స్, దీపావళి ప్రత్యేక రైళ్లతో పాటు రైలు నెంబర్ 07046 సికింద్రాబాద్ నుంచి దిబ్రుగఢ్ రూట్లో అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ రైలును నవంబర్ 27వ తేదీ వరకు పొడిగించినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఈ రైలు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ టు -దిబ్రుగఢ్ రైలు ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి ఈ రైలు బుధవారం రాత్రి 8.50 గంటలకు దిబ్రుగఢ్ చేరుకుంటుంది.
ఇక రైలు నెంబర్ 07047 దిబ్రుగఢ్ నుంచి సికింద్రాబాద్ రూట్‌లో అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ రైలును నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది. ఈ రైలు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. దిబ్రుగఢ్- టు సికింద్రాబాద్ రైలు ప్రతి గురువారం ఉదయం 9.10 గంటలకు దిబ్రుగఢ్‌లో బయలుదేరి ఈ రైలు శనివారం రాత్రి 4.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ టు దిబ్రుగఢ్, దిబ్రుగఢ్ టు సికింద్రాబాద్ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, సామర్లకోట జంక్షన్, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్‌లలో ఆగుతాయని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.