మనతెలంగాణ/హైదరాబాద్ : దసరా పండుగ సందర్భంగా రద్దీని నివారించేందుకు తాత్కాలికంగా ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. దీనిలో భాగంగా కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.10 నుంచి రూ.20 వరకు పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పెరిగిన ధరలు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9వ వరకు వర్తిస్తాయని రైల్వే శాఖ పేర్కొంది.
సికింద్రాబాద్ నుంచి నాలుగు ప్రత్యేక సర్వీసులు..
దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం నాలుగు ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్- టు యశ్వంత్ పూర్, సికింద్రాబాద్ టు -తిరుపతిల మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్- టు యశ్వంత్ పూర్ ఈనెల 28వ తేదీన, యశ్వంత్ పూర్ టు -సికింద్రాబాద్ 29వ తేదీన, తిరుపతి టు -సికింద్రాబాద్ అక్టోబర్ 9వ తేదీన, సికింద్రాబాద్- టు తిరుపతికి 10వ తేదీన ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.