Monday, December 23, 2024

తిరుపతి, కాశీ భక్తులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తిరుపతి, కాశీ లాంటి పలు పుణ్యక్షేత్రాలకు ఇప్పటికే పలు రైళ్లను నడిపిస్తున్న దక్షిణ మధ్య రైల్వే మరిన్ని
ఆధ్యాత్మిక ప్రాంతాలకు కొత్తగా మరి కొన్ని రైళ్లను నడిపించబోతోంది. ఇందులో మహబూబ్‌నగర్ నుండి గోరక్‌పూర్‌కు బుధవారం ఉదయం 9.00 గంటలకు వెళ్లనుంది. తిరుగు ప్రయాణంలో ఆ రైళ్లు సోమవారం సాయంత్రం ఆరు గంటలకు మహబూబ్‌నగర్‌కు రానుంది. అలాగే గోరక్‌పూర్ నుండి మరో రైలును మహబూబ్‌నగర్‌కు నడిపిస్తున్నారు. ఈ రైలు గోరక్‌పూర్ నుండి ఆదివారం సాయంత్రం 6.30కు బయలుదేరనుంది.

తిరుగు ప్రయాణంలో ఈ రైలు శనివారం ఉదయం 8.30 గంటలకు మహబూబ్‌నగర్‌కు రానుంది. ఇంకా సికింద్రాబాద్ నుండి ఛాప్రాకు ఏప్రిల్ ఒకటో తేదీన నడిపించనున్నారు. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుండి బుధవారం మధ్యాహ్నం 2.30కు బయలుదేరనుండగా తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌కు సోమవారం రాత్రి 9.30కు చేరనుంది. అలాగే ఛాప్రా నుండి సికింద్రాబాద్‌కు 30వ తేదీన మరో ట్రైన్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారులు నడిపించనున్నారు. ఆ ట్రైన్ ఆదివారం సాయంత్రం 4.30కు బయలు దేరనుండగా, తిరుగు ప్రయాణంలో శనివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు రానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News