Friday, November 22, 2024

కోటి 94 లక్షల విలువైన గంజాయిని జప్తు చేసిన దమ రైల్వే రక్షణ దళం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే రక్షణ దళం కిందటి నెల సెప్టెంబర్‌లో 8 మంది వ్యక్తులను అరెస్టు చేసి రూ.1.94 కోట్ల కంటే ఎక్కువ విలువైన గంజాయిని జప్తు చేసింది. నెలసరి కార్యక్రమాల్లో భాగంగా రైల్వే రక్షణ శాఖ కీలకంగా పని చేసినట్లు బుధవారం ఒక ప్రకటనలోపేర్కొంది. అలాగే ఆపరేషన్ ‘నాన్హే ఫారిస్టే ’ కార్యక్రమం ద్వారా 72 మంది పిల్లలను రక్షించినట్లు వెల్లడించింది. రైల్వేరక్షణ దళం (ఆర్.పి.ఎఫ్ )కు రైల్వే ఆస్తుల పరిరక్షణ, ప్రయాణీకులు తిరిగే ప్రాంతాలపై నిఘాతో పాటు, ప్రయాణీకుల భద్రతపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా రైల్వేరక్షణ దళం రైలు వినియోగదారులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి 24 గంటలూ పని చేస్తున్నట్లు తెలిపింది. ఆర్‌పిఎఫ్ కొన్నిసార్లు రైల్వే ఆస్తులను, ప్రయాణీకుల ప్రాణాలను రక్షించడానికి వారి ప్రాణాలను కూడా ఫణంగా పెట్టడానికి ఎల్లప్పుడూ ముందంజలో ఉంటోందని, ఇందులో ప్రభుత్వ పోలీసులు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల సమన్వయంతో తగుచర్యలు తీసుకుంటూ అనేక కార్యకలాపాలను చేపట్టడం ద్వారా గణనీయమైన పనితీరును నమోదు చేసినట్లు వెల్లడించింది.

ఆర్‌పిఎఫ్, ద.మ.రైల్వే సెప్టెంబర్ 2023 నెలలో సాధించిన విజయాలు క్లుప్తంగా ఇలా ఉన్నాయి
1.ఆపరేషన్ యాత్రి సురక్ష కింద ఆర్‌పిఎఫ్,ద.మ.రైల్వే సెప్టెంబర్-2023లో 53 కేసులు నమోదుచేసి 58 మంది నేరస్థులను అరెస్టు చేసింది. రూ. 56.78 లక్షల విలువ కలిగిన దొంగిలించిన ఆస్తులను జప్తు చేసింది. 2.‘ ఆపరేషన్ అమానత్ ‘ కింద , ఆర్‌పిఎఫ్ సిబ్బంది ప్రయాణీకుల వస్తువులను భద్రపరచడంలో సహాయం అందించారు. అంతే కాకుండా వాటిని నిజమైన యజమానులకు అప్పగించారు. ఆర్‌పిఎఫ్ ప్రయాణీకులకు చెందిన 49 లక్షలు కంటే ఎక్కువ విలువలగలిగిన 175 వస్తువులను తిరిగి వారికి అప్పగించారు. 3.రైల్వేల ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆర్‌పిఎఫ్ ‘ ఆపరేషన్ నార్కోస్ ‘ ను ప్రారంభించింది . ఈ ఆపరేషన్ కింద, సెప్టెంబర్ -2023 నెలలో 8 మంది వ్యక్తుల అరెస్టుతో రూ.1.94 కోట్ల కంటే ఎక్కువ విలువైన గంజాయిని ఆర్‌పిఎఫ్ జప్తు చేసింది .

4. ఆపరేషన్ నాన్హే ఫారిస్టే కింద వివిధ కారణాల వల్ల వారి కుటుంబం నుండి తప్పిపోయిన, విడిపోయిన సంరక్షణ రక్షణ అవసరమైన పిల్లలను గుర్తించి వారిని రక్షించే గొప్ప కార్యక్రమాన్ని ఆర్‌పిఎఫ్,ద.మ.రైల్వే చేపట్టింది. దీనిద్వారా సెప్టెంబర్ -2023 నెలలో ఆర్‌పిఎఫ్, ద.మ.రైల్వే 72 మంది పిల్లలకు (60 మంది బాలురు , 12 మంది బాలికలు) భద్రత కల్పించారు . ఆర్‌పి.ఫ్ ,ద.మ.రైల్వే సెప్టెంబర్-2023 నెలలో ఆపరేషన్ ఆహాత్ మిషన్ ను ప్రారంభించి ముగ్గురిని మానవ అక్రమ రవాణా నుండి 16 మంది అబ్బాయిలను రక్షించింది. 6. ఆర్‌పిఎఫ్, ద.మ.రైల్వే సెప్టెంబర్ -2023 నెలలో ఆపరేషన్ జీవన్ రక్ష కింద ఒక మహిళా ప్రయాణీకురాలి ప్రాణాలను కాపాడింది. సెప్టెంబర్ -2023 నెలలో ఆపరేషన్ సటార్క్ కింద రైళ్లలో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.77,520- విలువైన మద్యాన్ని జప్తు చేసి ముగ్గురిని అరెస్టు చేసి వారిని ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించారు. మద్యం అక్రమ రవాణాకు సంబందించిన 8 మంది నేరస్థులపై ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ కేసులు నమోదు చేసింది. 8.దళారుల కార్యకలాపాలను గణనీయంగా అరికట్టడానికి, సామాన్యులకు రైల్వే టిక్కెట్లను అందుబాటులో ఉంచడానికి ఆర్‌పిఎఫ్ ‘ ఆపరేషన్ ఉపలబ్ద్ ’ను ప్రారంభించింది.

దీనిద్వారా ఆర్‌పిఎఫ్, ద.మ.రైల్వే సెప్టెంబర్-2023 నెలలో18 కేసులు నమోదు చేసింది. 14మంది దళారులను అరెస్టు చేసి మొత్తం రూ.2,51,689- విలువైన 95 లైవ్ టిక్కెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. 9. రైల్వే ఆస్తుల విధ్వంసాలను ఆరికట్టే చర్యల్లో భాగంగా ఆర్‌పిఎఫ్ ‘ ఆపరేషన్ రైల్ సురక్ష ‘ ను ప్రారంభించింది. దీనిద్వారా 34 కేసులను కనుగొని రూ.89 ,40,007 – విలువైన చోరీకి గురైన రైల్వే ఆస్తులను తిరిగి రాబట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News