Sunday, December 22, 2024

సరుకు రవాణాలో ద.మ రైల్వే రికార్డు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సరుకు రవాణా విభాగంలో దక్షిణ మధ్య రైల్వే ఈ ఏడాదిలోనే రికార్డు సాధించింది. ఈ మేరకు
వంద మిలియన్ టన్నుల లోగింగ్ చేసి చరిత్ర సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణా లోడింగ్ అత్యుత్తమంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 26, 2023 నాటికి 100 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ సరుకును లోడ్ చేయడంలో కీలకమైన మైలురాయిని అధిగమించింది. ముఖ్యంగా దీన్ని సాదించడానికి 270 రోజులు మాత్రమే తీసుకుంది . ఇది గత ఆర్థిక సంవత్సరం 2022 -23లో 284 రోజులలో, 2021- 22లో 317 రోజులతో సాధించిన అత్యుత్తమ సమయాలతో పోల్చితే, సరుకు రవాణాలో 100 మిలియన్ టన్నులను అధిగమించడానికి జోన్ సాధించిన వేగవంతమైన సమయం ఇదే కావడం విశేషం. రైలు రవాణా వైపు నూతన వస్తువులను ఆకర్షించడానికి జోన్ అనేక చురుకైన చర్యలు తీసుకోవడంతోపాటు , అదే సమయంలో ఇప్పటికే ఉన్న సరుకు రవాణా వ్యవస్థను కూడా బలోపేతం చేసుకుంది.

సరుకు రవాణాను నిర్వహించే టెర్మినల్లు నిరంతరం మెరుగుపడుతుండగా, సరుకులను సకాలంలో అందజేయడం కోసం సరుకు రవాణా రైళ్ల కదలికను కూడా అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సరుకు రవాణా లోడింగ్‌లో వృద్ధి మొత్తం సరుకు రవాణా విభాగంలోనే కనిపించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అన్ని వస్తువులు అధిక లోడింగ్ స్థాయిలను అధిగమించాయి. సరుకు రవాణా వినియోగదారుల నుండి డిమాండ్‌ను నిరంతరం పర్యవేక్షిణా ద్వారా వ్యాగన్ల సకాలంలో సరఫరాను అందిస్తుంది. వస్తువుల వారీగా లోడింగ్‌లో ఇవి ఉన్నాయి. 50.635 మిలియన్ టన్నుల బొగ్గు, 25.226 మిలియన్ టన్నుల సిమెంట్, 5.961 మిలియన్ టన్నుల ఎరువులు, 5.161 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 3.396 మిలియన్ టన్నుల ఉక్కు కర్మాగారాలకు సంబంధించిన ముడి పదార్థాలు, 2.722 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం, 7.752 మిలియన్ టన్నుల ఇతర వస్తువులు ఇలా మొత్తం 100.853 మిలియన్ టన్నులు రవాణా చేసింది.

మరో వైపు బొగ్గు గనుల నుంచి బొగ్గు రవాణాపై జోన్ ప్రత్యేక దృష్టి సారించడంతో కోల్ లోడింగ్ పుంజుకుంది. భద్రాచలం – సత్తుపల్లి మధ్య ప్రత్యేకమైన కొత్త రైలు మార్గం 2023లో బొగ్గు రవాణా కోసం ప్రారంభించబడింది. వీటితో పాటు, సిమెంట్, ఇనుప ఖనిజం, ఆహార ధాన్యాలు ఎరువుల లోడింగ్ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక స్థాయిలో జరిగింది. ఈ అంశాలన్నీ తక్కువ వ్యవధిలో జోన్ ద్వారా అత్యుత్తమ పనితీరును నమోదు చేయడంలో సహాయపడ్డాయి.ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈ అతున్నతమైన పనితీరును కనబరిచి సరకు రవాణాలో 100 మిలియన్ టన్నుల మైలు రాయిని అధిగమించినందుకు దక్షిణ మధ్య రైల్వే ఆపరేషన్స్, అండ్ కమర్షియల్ బృందాన్ని అభినందించారు. జోన్ లో సరుకు రవాణాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తద్వారా ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని ఆయన పేర్కొన్నారు.

రైల్వే మంత్రిత్వ శాఖ విధాన సంస్కరణలు మరియు వినూత్న చొరవల ఫలితంగా సరుకు రవాణా పరంగా జోన్ అసాధారణమైన పనితీరును నమోదు చేయడంలో సహాయపడ్డాయని సరుకు రవాణాలో కొత్త పుంతలు తొక్కేందుకు వీలుగా మిగిలిన ఆర్థిక సంవత్సరంలో ఇదే జోరును కొనసాగించాలని దక్షిణ మధ్య రైల్వే బృందానికి ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News