Thursday, January 23, 2025

ప్రేమించింది… పెళ్లి చేసుకోలేదని మరదలును చంపిన బావ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ప్రేమించిన అమ్మాయి తనని పెళ్లి చేసుకోకపోవడంతో మరదలను బావ హత్య చేసిన సంఘటన ఢిల్లీలో మల్వియా నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇర్ఫాన్ అనే వ్యక్తి తన మరదలు నర్గీస్‌తో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇర్ఫాన్ స్విగ్గీలో డెలవరీ బాయ్‌గా పని చేస్తుండడంతో నర్గీస్ కుటుంబ సభ్యులకు నచ్చలేదు. దీంతో వీరి ప్రేమ పెళ్లికి నర్గీస్ కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఆమె స్టెనోగ్రాఫీ ట్రెయినింగ్‌కు మల్వియా నగర్ నుంచి వెళ్తోంది. అక్కడ కాపు కాసి ఆమెను ఇర్ఫాన్ పార్క్‌కు తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకోవాలని ఆమెను అతడు బలవంతం పెట్టాడు. దీంతో ఆమె ఒప్పుకోకపోవడంతో రాడ్ తీసుకొని ఆమె తలపై పలుమార్లు బాదడంతో చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇర్ఫాన్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: ఐఫోన్ కోసం 8 నెలల పసిబిడ్డ అమ్మకం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News