హైదరాబాద్: బాలీవుడ్ చిత్రాలు ఎక్కువ మంది ప్రేక్షకుల్లోకి వెళ్లేందుకు దక్షిణాది నటీనటులను తీసుకుంటున్నారని హీరోయిన్ రెజీనా తెలిపారు. బాలీవుడ్‌కు దక్షిణాది నటీనటుల అవసరం చాలా ఉందన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో దక్షిణాది తారలకు ఉండే అవకాశాల గురించి రెజీనా మాట్లాడారు. గతంలో దక్షిణాది వాళ్లకు ఛాన్సులు తక్కువగా ఉండేవని గుర్తు చేశారు. భాషపరమైన ఇబ్బందులు ఉండడంతో బాలీవుడ్ అవకాశాలు దొరికేవి కావని రెజీనా పేర్కొన్నారు. కరోనా తరువాత ఇండస్ట్రీలో భారీగా మార్పులు వచ్చాయన్నారు.
ఇప్పుడు బాలీవుడ్ కు ఆ ఆప్షన్ లేకుండా పోయిందని, దక్షిణాదిలో బాలీవుడ్ సినిమాలు ఆదరణ కావాలని ఇక్కడి నటులను తీసుకోవాల్సిన ఆవసరం ఏర్పడిందని రెజీనా వివరించారు. బాలీవుడ్ ప్రాజెక్టులు చేయడంపై తనకు ఇప్పటివరకు ఇబ్బందులు లేవన్నారు. బాలీవుడ్ ప్రాజెక్ట్‌కు ఓకే అన్నానని, త్వరలో విషయాలు బయట పెడుతానని చెప్పారు.’విదాముయూర్చి’ సినిమాలో హీరో అజిత్, అర్జున్‌లకు తోడుగా త్రిష, రెజీనా నటించారు. ఈ సినిమాకు మాగిజ్ తిరుమేనని దర్శకత్వం వహించగా అర్జున్ కీలక పాత్రలో నటించారు. ఫిబ్రవరి 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.