Saturday, December 21, 2024

కరాటే పోటీల్లో కొత్తకోట విద్యార్థికి బంగారు పతకం

- Advertisement -
- Advertisement -

సౌత్ ఇండియన్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లాలో ఆదివారం నిర్వహించగా పోటీల్లో గాడ్స్ ఆన్ వారియర్స్ ఫోటో ఖాన్ అకాడమీకి చెందిన విద్యార్థి పాల్గొని పథకాలు సాధించినట్లు క్లబ్ ఫౌండర్ అబ్దుల్ నబీ తెలిపారు. ఈ పోటీలలో దాదాపు 1200 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.

గాడ్స్ ఆన్ వారియర్స్ షోటోఖాన్ కరాటే విద్యార్థి అండర్ 13 కుమితే విభాగంలో సాత్విక్ గౌడ్ బంగారు పతకం సాధించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు కోల ప్రతాప్ కుమార్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రం అందజేసినట్లు క్లబ్ ఫౌండర్ అబ్దుల్ నబీ తెలిపారు.ఈ సందర్భంగా సీనియర్ కరాటే మాస్టర్ సయ్యద్ అశ్వ సాయికుమార్, ఎండి సలీం, జాఫర్, సాధిక్, హరీష్ యాదవ్, ఇంతియాజ్, సుమ, జహంగీర్, మంజునాథ్, చందు తదితరులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News