వారసత్వ సంపద గుర్తింపునకు సాయం చేస్తామని హామి
మనతెలంగాణ/మహబూబ్ నగర్ : చారిత్రాత్మక ముడుమాల్ నిలువురాళ్లకు ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు సాధించేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అధ్యక్షుడు, జై మక్తల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సందీప్ మక్తల్ చేస్తున్న కృషిలో కీలక ముందడుగు పడింది. సందీప్ మక్తాల ఆహ్వానం మేరకు దక్షిణ కొరియాలోని సేజొంగ్ యూనివర్సిటీకి చెందిన ఆరుగురు సభ్యుల బృందం ముడుమాల్‌ను సందర్శించింది. నిలువురాళ్లపై పరిశోధన చేస్తామని ప్రకటించిన ఈ బృందం వారసత్వ సంపద గుర్తింపు దక్కడంలో తమ వంతు సాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఖగోళ పరిజ్ఞానాన్ని గుర్తించే స్కైచార్ట్ ఆనాటి ఆదిమానవులు చారిత్రాత్మక ముడుమాల్ నిలువురాళ్లలో ఏర్పాటు చేశారు. అయితే, ముడుమాల్ నిలువుల్లో గొప్పతనాన్ని తెలుసుకున్న సందీప్ దీనికి యునెస్కో వారసత్వ హోదా సాధించే స్థాయి కలిగి ఉందన్న విషయాన్ని గుర్తించారు.