Wednesday, January 22, 2025

మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ. 41 లక్షలకు టోకరా

- Advertisement -
- Advertisement -

డీప్‌ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తనతో మాట్లాడుతున్నాడని నమ్మిన ఓ మహిళ నిట్టనిలువునా మునిగింది. మస్క్ నంటూ నమ్మబలికిన కేటుగాడి మాయలో పడి రూ. లక్షల్లో నష్టపోయింది. దక్షిణ కొరియాకు చెందిన జియోంగ్‌జిసన్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. అందుకు డీప్‌ఫేక్ వీడియో కారణమైంది. ఎలాన్‌మస్క్ జీవిత చరిత్ర చదివిన తర్వాత ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను. అలాంటి నాకు గత ఏడాది ఒక కలలాంటి అనుభవం ఎదురైంది. జులై 17న ఇన్‌స్టాగ్రాంలో మస్‌క పేరుతో ఉన్న ఖాతాకు ఫ్రెండ్స్ జాబితాలో యాడ్ చేశాడు. అది చూసి , మొదట నాకు అనుమానం వచ్చింది. అయితే తన పని ప్రదేశంలోని చిత్రా లు షేర్ చేయడం, తన పిల్లల గురించి మాట్లాడటం చూసి ఆ సందేహాలు ఎగిరిపోయాయి. అలాగేతన అభిమానులను కాంటాక్ట్ అయ్యే తీరును ఆయన వెల్లడించాడు.

దక్షిణ కొరియా అధ్యక్షుడితో తన మీటింగ్ గురించి చెప్పాడు. ఒకసారి వీడియో కాల్‌లో మాట్లాడుతూ … నన్ను ప్రేమిస్తున్నానని కూడా చెప్పాడు” అంటూ ఆమె వల్లడించారు. ఆ సైబర్‌నేరగాడు ఆ కాల్‌ను ఏఐ డీప్‌కేక్ సాంకేతికతను ఉపయోగించి మాట్లాడినట్టు ఆమె పేర్కొన్నారు. “ తర్వాత తన కొరియన్ ఉద్యోగుల కోసం డబ్బు పంపేలా అతడు నన్ను ఒప్పించాడు. నా డబ్బును పెట్టుబడిగా పెట్టి, ధనవంతురాలిని చేస్తానని నమ్మ బలికాడు. తన అభిమానులు ధనవంతులుగా మారితే తనకు సంతోషమన్నాడు.” అని ఆమె తెలిపారు. ఆ మాయమాటలు నమ్మిన ఆమె డబ్బు పంపారు. చివరకు రూ. 41 లక్షలు పోగొట్టుకున్నారు. ఇదిలా ఉంటే 2022 జనవరి నుంచి జూన్ మధ్యలో ఈ తరహా నేరాలు 280 వరకు వెలుగు చూసినట్టు కొరియా యూనివర్శిటీ నిర్వహించిన సర్వే పేర్కొంది. ఆ దేశంలో ఈ మోసాలను కట్టడి చేసేలా చట్టాల్లో తగిన నిబంధనలు లేవని మీడియా కథనం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News