Thursday, December 19, 2024

దక్షిణ కొరియాలో ప్రతిపక్ష నేతపై కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

దక్షిణ కొరియాలో ప్రతిపక్ష నాయకుణ్ని ఒక దుండగుడు అందరూ చూస్తుండగా గొంతుపై పొడిచి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ నాయకుడి పరిస్థితి విషమంగా ఉంది.

దక్షిణ కొరియాకు చెందిన ప్రతిపక్ష నాయకుడు లీ జే మ్యూంగ్ మంగళవారం బుసాన్ నగరంలో పర్యటిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. బుసాన్ లో నిర్మాణంలో ఉన్న విమానాశ్రయం పనులను పరిశీలించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా ఒక దుండగుడు ఆయనపై కత్తిలాంటి సాధనంతో దాడి చేసి, ఆయన గొంతుపై పొడిచాడు. దాంతో పెద్దగా అరుస్తూ మ్యూంగ్ పడిపోయారు. పోలీసులు వెంటనే దుండగుణ్ని అరెస్టు చేసి, మ్యూంగ్ ను ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో.. నెట్ లో వైరల్ గా మారింది. మ్యూంగ్ 2022 ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు యున్ సుక్ యోల్ చేతిలో ఓడిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News