40 డిగ్రీలకు చేరిన నాగర్‌కర్నూల్
మనతెలంగాణ/హైదరాబాద్: ఎండల తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ భగ్గుమంది. శుక్రవారం నాడు పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. నాగర్‌కర్నూల్‌లో 40డిగ్రీలు రికార్దయింది. దక్షిణ తెలంగాణలోని చాల జిల్లాలు శెగలు చిమ్మాయి. నారాయణపేట్ , వనపర్తి, నల్లగొండ జిల్లాల్లో 39.7డిగ్రీలు, సూర్యాపేట ,రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి, జిల్లాల్లో 39.5డిగ్రీలు నమోదయ్యాయి. జోగులాంబ గద్వాలతోపాటు గ్రేటర్ హైదరాబాద్‌లోనూ 39.3డిగ్రీలు నమోదయ్యాయి.
రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, నిర్మల్ ,ములుగు, వికారాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో 39డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. రాజన్న సిరిసిల్లలో అతితక్కువగా 37.7డిగ్రీలు నమోదయ్యాయి.