Saturday, December 21, 2024

సౌత్‌దే దేవధర్ ట్రోఫీ..

- Advertisement -
- Advertisement -

పుదుచ్చేరి: ప్రతిష్టాత్మకమైన దేవధర్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌లో సౌత్‌జోన్ టీమ్ విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో సౌత్‌జోన్ 45 పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్‌ను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో సౌత్‌జోన్ ఒక్క ఓటమిని కూడా చవిచూడకుండా అజేయంగా కప్పును దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఈస్ట్‌జోన్ 46.1 ఓవర్లలో 283 పరుగులకే కుప్పకూలింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఈస్ట్‌జోన్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (1), ఉత్క్రష్ సింగ్ (4)లు శుభారంభం అందించలేక పోయారు. వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ సింగ్ (6) కూడా విఫలమయ్యాడు.

అయితే సుదీప్ కుమార్, కెప్టెన్ సౌరభ్ తివారీ కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరు సౌత్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. సౌరభ్ 28 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులో వచ్చిన రియాన పరాగ్ మరోసారి విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించాడు. సుదీప్ కుమార్ 41 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన పరాగ్ 65 బంతుల్లోనే 5 సిక్సర్లు, 8 ఫోర్లతో 95 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు దూకుడుగా ఆడిన వికెట్ కీపర్ కుమార్ ఆరు ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు సాధించాడు. వీరిద్దరూ కీలక సమయంలో పెవిలియన్ చేరడంతో ఈస్ట్‌కు ఓటమి తప్పలేదు.
రోహన్ శతకం..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్‌జోన్‌కు ఓపెనర్లు రోహన్ కున్నుమ్మల్, మయాంక్ అగర్వాల్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు ఈస్ట్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రోహన్ 75 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 107 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో తొలి వికెట్‌కు 181 పరుగులు జోడించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మయాంక్ 63 పరుగులు చేశాడు. మిగతా వారిలో జగదీశన్ (54), రోహిత్ రాయడు (26), సాయి కిశోర్ 24 (నాటౌట్) రాణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News