Wednesday, January 22, 2025

సౌత్‌జోన్ హ్యాట్రిక్ విజయం

- Advertisement -
- Advertisement -

పుదుచ్చేరి : దేవ్‌ధర్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌లో సౌత్‌జోన్ జట్టు వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సౌత్‌జోన్ 9 వికెట్ల తేడాతో నార్త్‌ఈస్ట్ జోన్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్‌ఈస్ట్ జోన్‌ను సౌత్ బౌలర్లు 136 పరుగులకే కుప్పకూల్చారు. తర్వాత బ్యాటింగ్ బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌జోన్ 19.3 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ రోహన్ 58 బంతుల్లోనే 8 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (32)తో కలిసి తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించాడు. ఇక వికెట్ కీపర్ జగదీశన్ 15 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించడంతో సౌత్‌జోన్ అలవోక విజయాన్ని అందుకుంది. సౌత్‌కు ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్‌ఈస్ట్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. సౌత్ బౌలర్లు సమష్టిగా రాణించి ప్రత్యర్థి టీమ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించారు. విధ్వత్ కవెరప్ప, సాయి కిశోర్ మూడేసి వికెట్లు తీశారు. నార్త్‌ఈస్ట్ టీమ్‌లో జోతిన్ (40), కెప్టెన్ కిషంగ్‌బామ్ (23) మాత్రమే కాస్త రాణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News