రూ.15లక్షల విలువైన 10బైక్‌లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన టాస్క్‌ఫోర్స్ ఎడిసిపి చక్రవర్తి
మనతెలంగాణ, హైదరాబాద్ : బైక్‌లను చోరీ చేస్తున్న ఇద్దరు యువకులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.15లక్షల విలువైన 10బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డిసిపి చక్రవర్తి గుమ్మి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని సరూర్‌నగర్, పి అండ్ టి కాలనీకి చెందిన ఉత్తమ్ కుమార్ విద్యార్థి, సందీప్‌కుమార్ బిగ్‌బాస్కెట్‌లో పనిచేస్తున్నాడు. ఇద్దరు బిగ్‌బాస్కెట్‌లో పనిచేస్తున్నారు. ఇద్దరికి రెస్‌బైక్‌లపై ఆసక్తి ఎక్కువ, వారు చేస్తున్న పనికి వచ్చే డబ్బులు రేస్‌బైక్‌లను కొనుగోలు చేసేందుకు సరిపోవు. దీంతో ఇద్దరు కలిసి స్పోర్ట్ బైక్‌లను చోరీ చేయాలని ప్లాన్ వేశారు. మీర్‌పేట, ఎల్‌బి నగర్, మేడిపల్లి, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్‌లను చోరీ చేశారు. నిందితులపై నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారిని, బైక్‌లను మీర్‌పేట పోలీసులకు కేసు దర్యాప్తు కోసం అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సై నరేందర్, శ్రీశైలం, ఎండి తకియుద్దిన్, చంద్రమోహన్ నిందితులను పట్టుకున్నారు.