Monday, January 20, 2025

ప్రయాణికుల కోసం కొత్త సదరన్ సర్క్యూట్ ప్రారంభం

- Advertisement -
తిరువణ్ణామలై, అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరుల చుట్టి వచ్చేలా
కొత్త ప్యాకేజీ అందుబాటులోకి…
ఆగష్టు, సెప్టెంబర్‌లో యాత్ర ప్రారంభం
హైదరాబాద్ :  తిరువణ్ణామలై, అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరులను కవర్ చేస్తూ టూరిస్ట్ రైలును ఐఆర్‌సిటిసి ప్రకటించింది. దీని పేరును జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణయాత్ర కొత్త సదరన్ సర్క్యూట్ భారత్ గౌరవ్‌గా నామకరణం చేసింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని 10 నిర్ధారించిన స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కడానికి, దిగడానికి ఏర్పాట్లు చేసింది. ఈ యాత్రకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, (ఐఆర్‌సిటిసి)కి ఇప్పటివరకు ప్రయాణికుల నుండిచి వచ్చిన స్పందనతో ఉత్సాహంగా, భారతదేశంలోని ఇతర ప్రసిద్ధ, ముఖ్యమైన యాత్రా స్థలాలను కవర్ చేసే భారత్ గౌరవ్ రైళ్ల నిర్వహణ కోసం మరిన్ని టూరిస్ట్ సర్క్యూట్లను ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా కొత్త టూరిస్ట్ సర్క్యూట్ జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్రను చేపట్టింది. ఈ రైలు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను కవర్ చేస్తుందని అధికారులు తెలిపారు.
8 రాత్రులు, 9 రోజుల వ్యవధి…
8 రాత్రులు, 9 రోజుల వ్యవధిలో ఈ యాత్రను ఐఆర్‌సిటిసి పూర్తి చేస్తుంది. ప్యాకేజీలో భాగంగా రైలు, రోడ్డు రవాణాతో సహా, వసతి సౌకర్యం, క్యాటరింగ్ ఏర్పాట్లు (ఉదయం టీ, అల్పాహారం, లంచ్, డిన్నర్ – ఆన్-బోర్డు, ఆఫ్-బోర్డ్ రెండు), ప్రయాణం అంతటా వృత్తిపరమైన, స్నేహపూర్వక టూర్ ఎస్కార్ట్ సేవలు, ప్రయాణ భీమా సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ కొత్త సదరన్ సర్క్యూట్‌లో ఐఆర్‌సిటిసి ఇప్పటికే మూడు ట్రిప్పులను ప్రకటించింది – ఆగస్ట్ 9, 23లతో పాటు 5 సెప్టెంబర్ 2023న ప్రారంభమయ్యే ట్రిప్పుల కోసం బుకింగ్‌లను చేసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ఆసక్తి గల ప్రయాణికులు ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ http://www.irctctourism.com లేదా కౌంటర్ నంబర్లను 040-27702407, 970 1360701, 8287932228, 8287932229, 8087932231, 9281495843 సంప్రదించవచ్చని ఐఆర్‌సిటిసి తెలిపింది.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News