హైదరాబాద్ : వేసవి సెలవుల నేపథ్యం లో ద.మ రైల్వే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన స్టేషన్ల మీదు గా తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈ సమ్మర్ స్పెషల్ రైళ్ల సంఖ్యను మరింత పెంచుతోంది. అందులో భాగంగా శుక్రవారం రాత్రి 8 గంటలకు 07597 నెంబరు గల రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, నెల్లూరు, గుడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా రేపు (ఏప్రిల్ 9) ఉదయం 7.50 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. అదేవిధంగా ఏప్రిల్ 10వ తేదీన రాత్రి 7.50 గంటలకు 07597 నంబర్ గల రైలు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుంది.
బీజాపూర్- తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లు
వీటితో పాటు కర్ణాటకలోని బీజాపూర్- తిరుపతిల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 9వ తేదీన 07697 నంబర్ గల రైలు ఉదయం 9.40 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి రేణిగుంట, రైల్వే కోడూరు, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, బళ్లారి, తోరణగల్లు, హోస్పేట, మునిరాబాద్, కొప్పల్, గడగ్, హోలే ఆలూర్, బదామి, బాఘల్ కోట్, ఆల్మట్టి, బసవ బాగేవాడి రోడ్డు స్టేషన్ల మీదుగా అదే రోజు రాత్రి 11.30 గంటలకు బీజాపూర్ చేరుకుంటుంది. అదేవిధంగా ఏప్రిల్ 10వ తేదీన 07698 నెంబర్ రైలు ఉదయం 5 గంటలకు బీజాపూర్ నుంచి బయలుదేరి సాయంత్రం 6.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతికి వెళ్లాలనుకునే వారు ఈ సమ్మర్ స్పెషల్ రైళ్ల సర్వీసులను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.