Monday, December 23, 2024

సంకర సంస్కృతిలోకి దక్షిణాది రాష్ట్రాలు

- Advertisement -
- Advertisement -

వ్యవసాయానికి ఎద్దులను, పాల కోసం బర్రెలను పెంచడం మట్టుకే ఇక్కడి ప్రజలకు తెలిసిన పశు సంపద అవసరాలు. పొలాల అమావాస్య లాంటి పండుగలు జరిగే చోట ఎద్దులను అలంకరిస్తుంటారు. ఆవును పూజించడం, దాని పేడను పవిత్రంగా భావించడం, గోమూత్రాన్ని సేవించడం ఉత్తరాదిలో కనబడే ఆచారం. ప్రత్యేకంగా గోవులను ఒక చోట చేర్చి దాణా పెడుతూ వాటిని దైవ స్వరూపంగా భావించి సాకడం అక్కడి గోశాల విధానం. ఇప్పుడు దక్షిణాన కూడా గోశాలలు మొదలయ్యాయి. కాషాయం ఒక రంగు. ఆ రంగు బట్టలు, తలపాగా, జెండా ఇప్పుడు ఒక జాతి పేటెంట్‌గా మారిపోయింది. దక్షిణాది నగరాల్లోకి వలస వచ్చిన ఉత్తరాది వ్యాపారులు ఈ సంస్కృతిని విరివిగా ప్రచారానికి తెచ్చారు. అన్ని రంగుల్ని ఒక్కలా ఆదరించిన దక్షిణాదిలో ఇళ్లపై కాషాయ జెండా కొత్తగా కనిపిస్తోంది. పెళ్లిళ్లలో హోమాలు, దాండియా, మెహందీ ఫంక్షన్లు వచ్చేశాయి. హిందీ సినిమాల్లో కనబడే ఈ ఉత్తరాది వివాహ ఆచారాలు ఇప్పుడు ఇక్కడ కూడా ప్రాధాన్యతను సాధించాయి.

శతాబ్దాల పాటు మానవ జీవన విధానాలను చిలికి తీసిన మీగడ రూపమే ఆ జాతి సంస్కృతి. ఈ విశాల విశ్వంపై ఆయా నేలల్లో బతుకుతున్న మానవ సమూహాలు అక్కడి కాలమాన, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వారి ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు ఏర్పరుచుకుంటాయి. పెళ్లి తంతు, పిల్లలకు నామకరణం, మృతుల అంతిమ యాత్ర, ఆస్తి పంపకాలు.. ఇలా ఎన్నో అంశాలు తమవైన రీతిలో రూపొందించుకోబడ్డాయి.అవి జాతి ఐక్యతకు, గుర్తింపుకు సూత్రాలుగా పనికొస్తున్నాయి. ఒకే మాటలో చెప్పాలంటే అదే వారి సంస్కృతి. ఎవరైనా ఒక మానవ సమూహాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే ముందు వారి సంసృతిని సంకర పరచాలి. వారు నమ్మే గురువులతో కొత్త పాఠాలు చెప్పించాలి. ఇప్పుడు దక్షిణాదిపై ఆర్య సంస్కృతి అదే పంజాను విసురుతోంది.

ప్రత్యేకంగా గత పదేళ్లుగా దేశమంతా ఆర్య సంస్కృతిని విస్తరింపజేసే ప్రయత్నం తీవ్రంగా సాగుతోంది. పాలక బిజెపి ఆయా సంస్థలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. కాంగ్రెస్ పాలన కుటుంబ ఆధిపత్యంలో కొనసాగినా ఉత్తర, దక్షిణ భారతాల మధ్య వైషమ్యాల, తారతమ్యాల రేఖలు గీయలేదు. సాంస్కృతిక భేదభావాలు తెరపైకి వచ్చేవి కావు. అందుకే కాంగ్రెస్ సామరస్య భావనని ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాలు నమ్ముతున్నాయి. ప్రస్తుత కేంద్ర పాలన లక్ష్యమే హిందుత్వ భావజాలాన్ని దేశవ్యాప్తంగా పాదుకొల్పడమే అన్నట్లుగా ఉంది. తమ మతపర విధానాలను పాటించకపోతే హిందూ సమాజంలో గుర్తింపు, పలకరింపు ఉండదనే భయం కింది వర్గాల్లో కూడా చొచ్చుకుపోతోంది.

మోడీ లేకపోతే ఈ దేశం, తమ మతం ఏమైపోతుందో అనే బెంగ హిందువుల్లో కొత్తగా గూడు కట్టుకుంటోంది. దేశం లో నిరుద్యోగిత, పేదరికం, మత అసహనం పెరిగిపోతున్నా తమ మతం గొప్పగా ఉంటే సరిపోతుంది అనే భావన సాధారణ ప్రజల్లో వ్యాపిస్తోంది. మతమంటే ఓ ఐడెంటిటీ అని మాత్రమే భావించే దక్షిణాది ప్రజల్లో కూడా మెల్లమెల్లగా ఆర్య సంస్కృతి గొప్పదనే భావన వ్యాపించడం స్పష్టంగా కనబడుతోంది. నిజానికి బిజెపి భావజాలమంతా ఉత్తర భారతంలో పుట్టిందే. ఉత్తర భారతీయుల జీవన సరళి, నమ్మకాలు, విశ్వాసాలను అది ప్రతిబింబిస్తుంది. దక్షిణాది ప్రజలు కొలిచే దేవుళ్ళు, వారి నమ్మకాలు, పండుగలు, మొక్కులు తీర్చడాలు పూర్తిగా వేరు. భిన్న ఆచారాల అవలంబన వల్ల ‘దక్షిణ’లో బిజెపికి ఆదరణ లభించకపోవడం సహజమే. అయితే దీనికి విరుగుడుగా చర్యలు ఇప్పటికే మొదలయ్యాయి. నేటి ఆధునిక జీవనానికి ఆర్య సంస్కృతియే అసలైన ఆలంబన అనే భ్రమల ప్రచారం సాగుతోంది. ఆ వలలో చిక్కిన దక్షిణాది ప్రజలు ఆర్య సంస్కృతి పాటించే విధానాలపై మోజు పెంచుకుంటున్నారు.

నదులకు పూజలు చేసే విధానం దక్షిణాదిన అంతగా లేదు. గోదావరి ప్రవహించే పరిసర గ్రామాల్లో నదిలో తెప్పలు ఆచారంలా కనబడుతుంది. అయితే బ్యారేజీలు కట్టినాక ప్రభుత్వాలు ఇక్కడ కూడా నదులను పూజించడం మొదలైంది. పళ్లెంలో చీర, సారె, పూలు, గాజులు పెట్టి నీళ్లలో వదిలి దండం పెట్టడం ప్రభుత్వ కార్యక్రమంగా మారిపోయింది. ఇలా చేస్తేనే ప్రజలు తమను ఆదరిస్తారనే ఆలోచనే ఆర్య భావజాలానికి బానిసత్వాన్ని సూచిస్తోంది. ఇలా చేయకపోతే ప్రజల మనసును, ఓటును ఎవరో లాగేసుకుంటారనే భయం మిగితా పార్టీల్లో మొదలైంది.

యజ్ఞాలు, యాగాలు ఆర్య సంస్కృతిలో భాగమే. దక్షిణం వైపు ఋషులు కనిపించరు. రాజ్యవిస్తరణకు అశ్వమేధయాగం చేపట్టినట్లు ఇప్పుడు రాజకీయ నేతలు చాటుకో నేటికో ఎన్నికల్లో తమ గెలుపు కోసం ఏవేవో యాగాలు చేయడం మొదలుపెట్టారు. ఆర్య సంస్కృతికి ప్రతినిధులుగా ఇక్కడ కొనసాగుతున్న పీఠాధిపతులు వీటికి నేతృత్వం వహిస్తున్నారు. ఇంతకాలం ఇవేవీ లేకుండానే గెలుపోటములు చూశాం కదా అనే విచక్షణ కోల్పోవడం కూడా ఉత్తరాది సంప్రదాయాలకు తల ఒగ్గడమే. వ్యవసాయానికి ఎద్దులను, పాల కోసం బర్రెలను పెంచడం మట్టుకే ఇక్కడి ప్రజలకు తెలిసిన పశు సంపద అవసరాలు. పొలాల అమావాస్య లాంటి పండుగలు జరిగే చోట ఎద్దులను అలంకరిస్తుంటారు. ఆవును పూజించడం, దాని పేడను పవిత్రంగా భావించడం, గోమూత్రాన్ని సేవించడం ఉత్తరాదిలో కనబడే ఆచారం. ప్రత్యేకంగా గోవులను ఒకచోట చేర్చి దాణా పెడుతూ వాటిని దైవ స్వరూపంగా భావించి సాకడం అక్కడి గోశాల విధానం. ఇప్పుడు దక్షిణాన కూడా గోశాలలు మొదలయ్యాయి.

కాషాయం ఒక రంగు. ఆ రంగు బట్టలు, తలపాగా, జెండా ఇప్పుడు ఒక జాతి పేటెంట్‌గా మారిపోయింది. దక్షిణాది నగరాల్లోకి వలస వచ్చిన ఉత్తరాది వ్యాపారులు ఈ సంస్కృతిని విరివిగా ప్రచారానికి తెచ్చారు. అన్ని రంగుల్ని ఒక్కలా ఆదరించిన దక్షిణాదిలో ఇళ్లపై కాషాయ జెండా కొత్తగా కనిపిస్తోంది. పెళ్లిళ్లలో హోమాలు, దాండియా, మెహందీ ఫంక్షన్లు వచ్చేశాయి. హిందీ సినిమాల్లో కనబడే ఈ ఉత్తరాది వివాహ ఆచారాలు ఇప్పుడు ఇక్కడ కూడా ప్రాధాన్యతను సాధించాయి. వాలెంటైన్స్ డే రోజున పార్కుల్లో కనిపించే జంటలను వేధించడం, బలవంతంగా రాఖీలు కట్టించడం ఎవరూ ఆపలేని దశకు చేరుకున్నాయి.

ద్రవిడ జీవన విధానం వల్ల హిందూ పురాణాలను, ఆచారాలను వ్యతిరేకించే అలవాటు తమిళ ప్రజల్లో పాతుకుపోయింది. ఉత్తరాది భాష, ఆచారాలు, సంస్కృతి అన్నా వారికి పడదు. అందుకే సనాతన ధర్మం తిరోగమన చర్యగా డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్ ధీమాగా అనగలిగాడు. తన మాటను వెనక్కు తీసుకోనని కచ్చితంగా చెప్పాడు. రామాయణంలో రాముడు ఉత్తరాది, ఆర్య ప్రతినిధి అని, రావణుడు తమ జాతివాడని వారు నమ్ముతారు. కర్ణాటకలో ముస్లిం విద్యార్థిని హిజాబ్ ధరించి కళాశాలకు కొత్తగా వివాదాస్పదమైంది.

కోర్టు కూడా విద్యాలయాల్లో మత విశ్వాసాలు చెల్లవంది. సాధారణ విషయాన్ని కావాలని రాద్ధాంతం చేయడం వెనుక దక్షిణాదిపై ఆర్య సాంస్కృతిక ఆధిపత్యమే కనబడుతుంది. ఈ మధ్య శామ్ పిట్రోడా మాటల్లో వచ్చిన భారతీయుల రంగురూపుల ప్రస్తావన పెద్ద వివాదంగా మారి చివరకు కాంగ్రెస్ పార్టీలో ఆయన పదవిని వదులుకోవలసి వచ్చింది. పిట్రోడా మాటను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆపాదించి ఎన్నికల ప్రచారంలో మోడీ లాభపడాలని చూశారు తప్ప పిట్రో డా మాటకు శ్యామరూపులు ఎవరూ బాధపడటం లేదు. నేల వేడిని బట్టి మనిషి రంగు ఏర్పడుతుంది. ఎవరి సంస్కృతి వారికి గొప్పది. ఇతరుల సంస్కృతులను గౌరవించడం కూడా సంస్కృతిలో భాగమే అనే అవగాహన అందరికీ శ్రేయస్కరం.

బి.నర్సన్ 9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News