Sunday, January 19, 2025

రుతుపవనాలు వచ్చేశాయ్

- Advertisement -
- Advertisement -

మన వర్షాకాలం వచ్చేసింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించా యి. సోమవారం ఇవి దక్షణ తెలంగాణ జిల్లాల్లో చురు గ్గా కదులుతున్నాయి. సాధారణంగా జూన్ రెండవ వా రంలో తెలంగాణలోకి ప్రవేశించాల్సిన రుతుపవనాలు ఈ ఏడాది వారం రోజులు ముండుగానే రాష్ట్రాన్ని తాకాయి. జూన్ 6న నైరుతి రుతుపవనాలు రాయలసీమ జిల్లాల మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే వాతవరణం అన్ని వి ధాలుగా అనుకూలంగా ఉండటంతో అంతకంటే మూడు రోజులు ముందుగానే రుతుపనాలు ప్రవేశించాయి.గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సాధారణం కంటే అధికంగానే వర్షపాతం నమోదయ్యే అవకావశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఉత్తర తమిళనాడు తీరం వద్ద పశ్చిమ పరిసర నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం సోమవారం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైవుంది. దీని ప్రభావమూ రుతుపవనాల కదిలికన మరింత క్రియాశీలకం చేసిందని చెబుతున్నారు. రాగల 5రోజుల్లో ఇవి రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి.

రాష్ట్రంలో మంగళవారం నాడు పలు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు , మెరుపులు గంటకు 50కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాష్ట్రంలో నిర్మల్ ,నిజామబాద్ , వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట్ ,జోగులాంబ గద్వాల, జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదిలాబాద్ ,కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీనంగర్, పెద్దపల్లి , జయబంకర్ భూపాలపల్లి, ములుగు,భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ , రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి , నాగర్‌కర్నూల్ , వనపర్తి తదితర జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్టంలోని పలు చోట్ల ఈ నెల 7వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం రాష్ట్రంలో గరిష్టంగా జోగులాంబ గద్వాల జిల్లా బూర్దిపాడులో 28.5 మి.మి వర్షం కురిసింది.మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. గరిష్టంగా అదిలాబాద్ జిల్లా భోరాజ్‌లో 41.2డిగ్రీలు నమోదుకాగా, చాప్రాలలో 40.8,పెద్దపల్లి జిల్లా మంథనిలో 40డిగ్రీలు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News