Saturday, January 11, 2025

కేరళలోకి నైరుతి పవనాల ఆగమనం

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: వారం రోజులు ఆలస్యంగా నైరుతి రుతు పవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండి) ప్రకటించింది. అతకుముందు బైపర్‌జాయ్ తుపాను ప్రభావం వల్ల నైరుతి రుతు పవనాల ఆగమనం ఆలస్యం కావచ్చని వాతావరణ శాతస్త్రవేత్తలు తెలిపారు. కేరళలోకి నైరుతి పవనాలు ఆలస్యంగా, మదకొడిగా ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సాధారణంగా నైరుతి రుతు పవనాలు జూన్ 1వ తేదీన ప్రవేశిస్తాయి. కొన్ని సందర్భాలలో నాలుగైదు రోజుల ఆలస్యం జరుగుతుంటుంది. ఈ ఏడాది జూన్ 4న నైరుతి రుతు పవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు మే నెల మధ్యలో ప్రకటించారు. అయితే స్కైమెట్ మాత్రం జూన్ 7న రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని, గరిష్ఠంగా మూడు రోజులు ఆలస్యం కావచ్చని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News