Monday, December 23, 2024

తొలకరి పులకరింత

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలోకి ‘నైరుతి’ రాక
సోమవారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లాలోకి…
రానున్న రెండు రోజుల్లో తెలంగాణ మొత్తం విస్తరణ
రుతుపవనాల రాకతో మూడు రోజుల పాటు
రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు
గంటకు 30 నుంచి 40 కిమీల వేగంతో ఈదురుగాలులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని, మహబూబ్‌నగర్ జిల్లాలోకి ఉదయం 8.30 గంటలకు నైరుతి విస్తరించిందని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడగా వేసవి వేడి, ఉక్కపోత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఈ నేపథ్యంలోనే రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంగళ, బుధవారాల్లో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిమీల వేగంతో ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ కేంద్రం వివరించింది. మంగళవారం ముఖ్యంగా పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు చల్లటి గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు సోమవారం ఆరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు గుజరాత్, కొంకణ్, మహారాష్ట్ర, మరాఠ్వాడా, కర్ణాటకలోని చాలా ప్రాంతాలు తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు ఉప హిమాలయన్ పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని భాగాలు, బీహార్‌లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Southwest Monsoon Arrives next 2 days in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News