Friday, December 20, 2024

నేటి నుంచి విస్తారంగా వర్షాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో నైరుతి రుతుపవనం ఆదివారం నాటికి దేశమంతటికి విస్తరించుకుంది. ఈ విషయాన్ని భారత వాతావరణ పరిశోధనా సంస్థ (ఐఎండి ) తెలిపింది. రికార్డుల పరంగా చూస్తే దేశమంతటికి ఏదో ఓ స్థాయిలో వానలు తాకే పరిస్థితి ఆరు రోజుల ముందే ఏర్పడింది. ఆదివారం రుతుపవనాలు రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌ల్లోని మిగిలిన ప్రాంతాలకు కూడా చేరుకున్నాయి. దేశమంతటా జులైలో వర్షాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయని శుక్రవారం ఐఎండి ప్రకటించింది. తూర్పు ఉత్తరప్రదేశ్, దక్షిణ బీహార్‌లలో రుతుపవనాలు పేలవ స్థితిలో ఉన్నాయి. అయితే ఇప్పుడు మొత్తం మీద చూస్తే సాధారణంగా జరగాల్సిన పరిణామం అయిన ఈ నెల 8 కంటే ముందే రుతుపవనాలు అంతటా ప్రవేశించినట్లు అయింది.

ఇక ఈ జూన్‌లో 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలో వానలు తక్కువగా నమోదు అయ్యాయి. సాధారణంగా ఇప్పటికే అత్యధికంగా వర్షాలు పడాల్సిన కేరళ, బీహార్‌లలో నిర్థారితం కన్నా తక్కువ స్థాయి వర్షాలు పడ్డాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కర్నాటకల్లో కూడా వర్షపాతం సాధారణం కన్నా తక్కువగా ఉంది. జూన్‌లో పలు ప్రాంతాలకు వర్షాలు విస్తరించుకున్నప్పటికీ , ఇంతకు ముందటితో పోలిస్తే తక్కువ వర్షపాతాలు రికార్డు అయ్యాయి. ఈ విధంగా వర్షాకాలంలో ఒక్కనెల ఓ విధంగా అసంతృప్తిని మిగిల్చింది. ఇక జులై తొలి పక్షంలో భారీ వర్షాలతోనే దేశవ్యాప్తంగా వర్షపాతం సగటున బాగా ఉన్నట్లుగా రికార్డుల్లోకి చేరుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News