Monday, January 20, 2025

భారత్ భూభాగంలోనికి నైరుతి రుతు పవనాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్ భూభాగంలోనికి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు తాకాయి. ఈ నెలాఖరున కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ మాల్దీవులు, కోమరిన్ ప్రాంతాల్లో కొంత వరకు నైరుతి పవనాలు విస్తరించి ఉన్నాయి. ఈ సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. సకాలంలోనే రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News