హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. రాయలసీమలోకి ఇప్పటికే ప్రవేశించిన రుతుపవనాలు నాగర్ కర్నూల్, గద్వాల్, నల్లగొండ జిల్లాల్లోకి కూడా చేరాయి. ఆ జిల్లాల్లో మేఘాలు అలుముకుని ఉన్నాయి. తెలంగాణలో కూడా భారీ వానలు పడే అవకాశం కనబడుతోంది.
రాగల మూడు రోజుల్లో అతి భారీ వానలు కురిసే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆదివారం రాత్రి ఓ మోస్తరు వానలు కురిసాయి. కాగా వాతావరణం కాస్త చల్లబడింది.
Southwest Monsoon advanced into some more parts of central Arabian Sea, some more parts of Karnataka, Rayalaseema, Coastal Andhra Pradesh, some parts of Telangana and some more parts of Westcentral and Northwest Bay of Bengal, today the 3rd June. pic.twitter.com/CLdQTlSxMO
— India Meteorological Department (@Indiametdept) June 3, 2024