- Advertisement -
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రం నుంచి తెలంగాణలోకి ప్రవేశించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 10న నైరుతి రాష్ట్రాన్ని తాకుతుంది. కానీ ఈ ఏడాది ఐదు రోజుల ముందుగానే నైరుతి రాష్ట్రంలోకి ప్రవేశించింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు విస్తరించే అవకాశముందని ఐఎండి తెలిపింది. దీంతో రాగల మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అటు నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తుండడంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని 17 జిల్లాలను ఎల్లో అలర్ట్‌గా అధికారులు ప్రకటించారు. అటు నైరుతి ప్రభావంతో బెంగళూరులో భారీగా వర్షాలు పడ్డాయి.
Southwest monsoon enters Telangana
- Advertisement -