- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మూడ్రోజుల్లో మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. వచ్చే మూడ్రోజులపాటు మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, ములుగు జిల్లాల్లో భారీవర్షం కురుసే అవకాశముందని సమాచారం.
కాగా, బుధవారం సాయంత్రం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షం దంచి కొట్టింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. దీంతో ఎక్కడివారు అక్కడే స్థంబించిపోయారు. గురువారం కూడా హైదరాబాద్ లో వాతావరణం చల్ల చల్లగా ఉంది. గురువారం కూడా వర్షం పడే అవకాశముంది.
- Advertisement -