- Advertisement -
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం ఉదయం కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించినట్లు ఐఎండి తెలిపింది. గతేడాది కంటే ఈసారి నైరుతి రుతుపవనాలు సమయం కంటే ముందే కేరళలోకి ప్రవేశించాయి. ఇప్పటికే కేరళలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో రుతుపవనాలు కూడా ప్రవేశించడంతో కేరళలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాగా, నైరుతి రుతుపవనాల ప్రభావంతో నాలుగైదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాగా, ఏపీలో గురువారం పొడి వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
- Advertisement -