న్యూఢిల్లీ: రెండేళ్ల తర్వాత 2021లో నైరుతి రుతుపవనాలు సాధారణ స్థాయిలో ఉండవచ్చని ప్రైవేట్ వాతావరణ అధ్యయన సంస్థ స్కైమెట్ సోమవారం తెలిపింది. 2019, 2020లో నైరుతి రుతుపవనాలు సాధారణం కన్నా అధికంగా ఉండడంతో అధఙక వర్షపాతం నమోదైంది. లానినా ప్రభావంతోనే గడచిన రెండేళ్లు అధిక వర్షపాతం నమోదైందని స్కైమెట్ తెలిపింది. పసిఫిక్ మహాసముద్రం చల్లబడడంతో లానినా పరిస్థితులు బలపడి అధిక వర్షపాతానికి దారితీస్తుందని పేర్కొంది. ఎల్‌పిఎలో(880.6 మిల్లీ మీటర్లు) 96-104 శాతం ఉంటే అది సాధారణ వర్షపాతంగా పిలుస్తారు.
ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన పరిస్థితులను బట్టి ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు కావచ్చని స్కైమెట్ అంచనా వేసింది. గత ఏడాది నైరుతి రుతుపవనాల పరిస్థితిపై స్కైమెట్ అంచనాలు తెలియచేయలేదు. దేశంలోని అధికార వాతావరణ శాఖ సాధారణంగా ఏప్రిల్‌లో రుతుపవనాల రాకపై సమాచారం అందచేస్తుంది.
Southwest Monsoon in 2021 to be normal: Skymet