భారీ వర్షానికి జలమయంగా మారిన రోడ్లు
తిరువనంతపురం(కేరళ): నైరుతి రుతుపవనాలు గత రెండు రోజులుగా ఉధృతం అయ్యాయి. దక్షిణ, మధ్య జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డం, చెట్లు విరిగిపడ్డం, అక్కడ నీరు నిలిచిపోయి జలమయం అవ్వడం జరిగింది.
కొట్టాయం,ఇడుక్కీ జిల్లాల్లో భారీ నష్టం జరిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. త్రిస్సూర్, కొజికోడ్ లను శనివారం రెడ్ అలెర్ట్ లుగా ప్రకటించారు. పాలక్కాడ్, వాయ్ నాడ్ లకు యెల్లో అలెర్ట్ ప్రకటించారు. ఒక్కరోజులో 20 సెంటీ మీటర్ల కన్నా ఎక్కువ వాన పడేట్లయితే రెడ్ అలెర్ట్ ప్రకటిస్తారు. 11 నుంచి 20 సెంటీ మీటర్ల మేరకు వాన పడితే ఆరెంజ్ అలెర్ట్ ప్రకటిస్తారు. 6 నుంచి 11 సెంటీ మీటర్ల మేరకు పడితే ఎల్లో అలెర్ట్ ప్రకటిస్తారు.
పంటలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. తోడుపుళ- పులియన్మల హైరోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొట్టాయంలో భారీ వర్షం నమోదయింది.