- Advertisement -
నైరుతి పవనాలు ఈనెల 31న కేరళకు తాకనున్నాయి. ఈసారి రుతుపవనాలు వేగం కాకున్నా సాధారణ తేదీల ప్రకారమే వస్తున్నాయని భారత వాతావరణ శాఖ ప్రస్తుత వాతావరణ పరిస్థితిని బట్టి అంచనా వేసింది. వాస్తవానికి మే 27 నుంచి జూన్ 4 లోగా రుతుపవనాలు ఏడు రోజుల వ్యవధిలో ప్రవేశిస్తాయని, అయితే ఈ ఏడాది నైరుతి పవనాలు మే 31న కేరళలో ప్రవేశిస్తాయని ఐఎండి వివరించింది.
భారత వ్యవసాయానికి నైరుతి పవనాలు ప్రాణం వంటివి. వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. దేశంలో ఎక్కువ భాగం వ్యవసాయం నైరుతి పైనే ఆధారపడి ఉంది. జూన్, జులై నెలలు చాలా ముఖ్యమైన రుతుపవనాల నెలలు. ఖరీఫ్ విత్తనాలు నాటడానికి ఈ రుతుపవనాలు చాలా అనుకూలం. జూన్ నుంచి వర్షాలు ప్రారంభమై సెప్టెంబరు నెలాఖరువరకు కొనసాగుతాయి. ఈసారి సాధారణం కన్నా అత్యధిక వర్షపాతం ఉంటుందని ఐఎండి అంచనా వేసింది.
- Advertisement -